పవన్ కళ్యాణ్ కు నిర్మాత, దర్శకుడు చంద్రబాబే : CM జగన్

-

పవన్ కళ్యాణ్ కు నిర్మాత, దర్శకుడు చంద్రబాబే అంటూ CM జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం… రూ.470 కోట్లతో తాండవ-ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్ పనులు ఈ సందర్భంగా చేపట్టారు.

రూ.16 కోట్లతో నర్సీపట్నం రహదారి విస్తరణకు జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నిత్యం ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా పనిచేస్తున్నాయని సీఎం జగన్ నర్సీపట్నంలో విమర్శించారు. మంచి చేస్తున్నా, వాళ్లకు చెడే కనిపిస్తోందని, నిబంధనల ప్రకారం పెన్షన్ల పై ఆడిట్ చేస్తుంటే తొలగిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో తాము యుద్ధం చేస్తున్నామని తెలిపారు. 14 ఏళ్ళు సీఎం గా ఉన్న చంద్రబాబు ఒక్క మంచి పని చేయలేదని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version