జగన్ ఈరోజు విశాఖ వెళ్లనున్నారు. అయితే అది అధికారిక కార్యక్రమం కోసం కాదు. ఒక ప్రైవేట్ కార్యక్రమం కోసం. ఈరోజు విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూతురి వివాహం జరుగుతోంది. ఈ వివాహానికే జగన్ హాజరు కానున్నట్టు సమాచారం. ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. ఈరోజు ఆయన కుమార్తె వివాహం జరుగుతోండగా ఆ నూతన జంటను ఆశీర్వాదించేందుకు జగన్ విశాఖ వెళ్లనున్నారు.
కాగా, వివాహానికి ముందు నిర్వహించే సంగీత్ వేడుకలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. కూతురి పెళ్లి అయిపోతుందన్న సంబరంలో బంధువులతో కలిసి అయన నృత్యం చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈరోజు జరగబోయే పెళ్లి వివాహ వేడుకకు ముఖ్యమంత్రితో పాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి హాజరు అవుతుండటంతో విశాఖలో భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.