అంగన్వాడీ కేంద్రాలకు పసుపు రంగులు.. వైసీపీ కౌంటర్

-

గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొత్తగా నిర్మాణం చేపట్టిన గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ కార్యలయాలు, అంగన్వాడీ కేంద్రాలకు వైసీపీ జెండా రంగులు వేసిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అధికారంలో ఉన్న పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఇలా తమ పార్టీ జెండా రంగులను ఎలా వేస్తారని తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసింది.

తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం (టీడీపీ, జనసేన, బీజేపీ) అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించారు.కాగా, ప్రస్తుతం SPSR నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరం గ్రామంలో అంగన్వాడీ సెంటర్‌కు అధికార పార్టీ పసుపు రంగులు వేసినట్లు తెలుస్తోంది. దీంతో వైసీపీ నేతలు అధికార పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఆనాడు మేం చేసింది తప్పయితే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version