భవిష్యత్తులో పాస్ పుస్తకాలకు సంబంధించి ఎలాంటి అక్రమాలు జరగకుండా వాటిని రూపొందించామని సజ్జల తెలిపారు. ‘క్యూఆర్ కోడ్ ముద్రించి భూహక్కుదారుల పూర్తి వివరాలను డిజిటలైజ్ చేశాం. రెవెన్యూ శాఖలో ఇలాంటి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఫొటో ముద్రించడంలో తప్పేముంది. గతంలో ప్రతిదానిపై తన ఫొటోలు వేసుకున్న చంద్రబాబుకు ప్రశ్నించే అర్హత ఉందా? ప్రజలెవ్వరికీ లేని అభ్యంతరం బాబుకి ఎందుకు?’ అని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
కాగా, పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ తన ఫొటో వేసుకున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రజల భూములను జగన్ పేరుతో రాసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.పార్టీ రంగుల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారు అని మండిపడ్డారు.సైకో జగన్‌కు రంగు వేసి శాశ్వతంగా ఇంటికి పంపాలి అని అన్నారు.