టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ల వ్యవహారం పై ఎట్టకేలకు కమిటీని ఏర్పాటు చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సినిమా టికెట్ల వ్యవహారం పై హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ఛైర్మన్ గా 10 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్.
సినీ గోయెర్స్ అసోసియేషన్ నుంచి ముగ్గురు ప్రతినిధులకూ ఈ కమిటీలో చోటు కల్పించింది. ఛైర్మన్ తో సహా ఏడుగురు అధికారులు కాగా, ఒక ఎగ్జిబిటర్, ఒక డిస్ట్రిబ్యూటర్ తో పాటు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఒక ప్రతినిధితో కమిటీని ఏర్పాటు చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. సినిమా టికెట్ల వ్యవహారాన్ని చక్కబెట్టే పనిలో పడిన ప్రభుత్వం.. ఈ నిర్ణయం తీసుకుంది. ధరల పెంపు విషయంలో ఎగ్జిబిటర్ల నుంచి ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కూలంకషంగా చర్చించనుంది ఈ కమిటీ. అంతేకాదు సినిమా టికెట్ల ధరలను పెంచేందుకు కూడా ప్రభుత్వం సన్నద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.