ఏపీ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా కొనసాగుతున్నాయి. శాసనసభలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, వైఫల్యాలపై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ నీచ రాజకీయాలు చేశారని, వ్యవస్థలను విధ్వంసం చేశారని తూర్పారబట్టారు.
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘జగన్ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. చివరికి చిన్న పిల్లలు ఆడే క్రికెట్ గార్డ్ లకు కూడా బొమ్మలు వేసుకున్నారు. ఇంటింటికీ రేషన్ అన్నారు. రూ.1600 కోట్లు ఖర్చు చేశారు.ప్రచార ఆర్భాటాల కోసమే తప్ప వాస్తవంగా ఇంటింటికీ రేషన్ ఇవ్వలేదు’అని ఘాటు విమర్శలు చేశారు.