వెంకట్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగిస్తే గెలుపు కోసం పని చేస్తాడు : జగ్గారెడ్డి

-

తెలంగాణలో రాజకీయాలు మొత్తం ఇప్పుడు మనుగోడు వైపే చూస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక రానుంది. అయితే.. ఈ నేపథ్యంలో ఇక్కడ జెండా పాతేందుకు రాజకీయ పార్టీలు ఎత్తుగడలు వేస్తున్నాయి. అయితే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో.. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్‌ శ్రేణులు ఆజాదీ కి గౌరవ్‌ పేరిట పాదయాత్రలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు చివరి రోజు పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఎవరు పిలిచినా పిలవకున్న మునుగోడు ప్రచారానికి వెళ్తానన్నారు. నా తరపున కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేస్తా. నా దగ్గర ఉన్న మెడిసిన్ త్వరలోనే బయటికి తీస్తానని ఆయన వ్యాఖ్యానించారు. వెంకట్ రెడ్డిని అధిష్టానం పిలిచి బుజ్జగిస్తే గెలుపు కోసం పని చేస్తాడని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు హోమ్ గార్డులు కాదు, ఐపీఎస్‌ లు కాదు.

మేమంత సైనికులం..అధిష్టానం మాకు బాస్ అని ఆయన స్పష్టం చేశారు. బండి సంజయ్ కోతల రాయుడు అంటూ విమర్శలు గుప్పించారు. దుబ్బాకలో ఈ సారి బీజేపీ గెలవదని, ఈటల కూడా హుజురాబాద్ లో ఒడిపోతానన్న భయంతో గజ్వేల్ నుంచి పోటీచేస్తా అని చెబుతున్నాడని ఆయన అన్నారు. ఈటలకి ఓటమి భయం పట్టుకుందని, ప్రియాంక గాంధీ మాకు ఇంచార్జ్ గా వస్తే నేను హ్యాపీ అని అన్నారు. రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి వ్యవహారాలపై తానేమి మాట్లాడబోనన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version