సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఆగమేఘాల మీద ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన రైలులో ఢిల్లీకి పయనం అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.తాను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అన్నారు. ‘నేను ఎమ్మెల్సీ అడగట్లేదు, అడగను కూడా. నేను మూడు సార్లు ఎమ్మెల్యే గా ఉన్నా, ఎమ్మెల్సీ కావాలని పడీ పడి అడిగే వ్యక్తిని కాదు.ఎమ్మెల్సీ విషయంలో కల్పిత వార్తలు రాయొద్దని’ మీడియాకు విజ్ఞప్తి చేశారు. కాగా, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కోసం శుక్రవారం సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగ్గారెడ్డి పర్యటనపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఢీల్లీకి బయలుదేరిన జగ్గారెడ్డి..
మీడియాకు జగ్గారెడ్డి విజ్ఞప్తి
నేను ఎమ్మెల్సీ అడగట్లేదు, అడగను కూడా,
నేను మూడు సార్లు ఎమ్మెల్యే గా ఉన్నా,
ఎమ్మెల్సీ కావాలని పడీ పడి అడిగే వ్యక్తిని కాదు. ఎమ్మెల్సీ విషయం లో ఊహాగాన వార్తలు రాయోద్దు. #jaggareddy #congress #rahulgandhi #sangaredd pic.twitter.com/QkYfakk8n8— Turupu Jagga Reddy(OFFICIAL ) (@ImJaggaReddy) March 6, 2025