BREAKING : మంత్రి హరీష్ రావుతో జగ్గారెడ్డి భేటీ

-

సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మంత్రి హరీష్ రావు ని కలిసి రిప్రెసెంటేషన్స్ ఇచ్చారు జగ్గారెడ్డి. అసెంబ్లీ లో మంత్రి హరీష్ రావు ని తన ఛాంబర్ లో కలిసిన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి…నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఫండ్స్ ఇవ్వాలని కోరారు. ఎన్ ఆర్ ఈ జీ ఎస్ స్కీమ్ కింద 5 కోట్ల 50 లక్షల ఫండ్స్ ఇవ్వాలని కోరడం జరిగిందని.. సంగారెడ్డి పట్టణంలోని ఫాతే ఖాన్ దర్గా అభివృద్ధి కోసం 3 కోట్లు ఇవ్వాలని కోరుతున్నానని ఈ సందర్భంగా జగ్గారెడ్డి తెలిపారు.


సంగారెడ్డి పట్టణంలోని ఈద్ గా అభివృద్ధి కోసం ప్రభుత్వం 5 కోట్లు ఇవ్వాలని కోరుతున్నానని.. సంగారెడ్డి పట్టణంలోని దీన్ దార్ ఖాన్ ఫంక్షన్ హాల్ అభివృద్ధి కోసం 5 కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించాలని కోరుతున్నానని వెల్లడించారు. సంగారెడ్డి పట్టణంలోనే ముస్లిం ల ఖాభారస్థాన్ (స్మశానవటిక ) కొరకు 5 ఎకరాల భూమి కావాలి.. ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా భూమి కేటాయించాలి.. అలాగే సంగారెడ్డి పట్టణంలో హిందువుల స్మశానవటిక కోసం 5 ఎకరాల భూమి కావలెను.. ఇది కూడా సర్కార్ వెంటనే పరిశీలించి మంజురు చేయాలనీ కోరుతున్నానని పేర్కొన్నారు. ఇక క్రిస్టియన్స్ కోసం కూడా సంగారెడ్డి పట్టణంలో 5 ఎకరాల భూమి క్రిస్టియన్స్ గ్రేవ్ యార్డ్ (స్మశానవటిక ) కేటాయించాలని ప్రభుత్వని కోరుతున్నా..*సదశివాపేట్ లో మెహబూబ్ పాషా దర్గా అభివృద్ధి కోసం 3కోట్లు మంజూరు చేయాలనీ ప్రభుత్వాని కోరుతున్నానని తెలిపారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version