బాక్సులు బద్ధలయ్యేలా ‘జై బాలయ్య’ సాంగ్.. ఫ్యాన్స్​కు పండగే..!

-

బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్​ రానే వచ్చింది. ‘వీరసింహారెడ్డి’ చిత్రం నుంచి ‘జై బాలయ్య’ అంటూ సాగే పాటను మేకర్స్​ ఇవాళ రిలీజ్​ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి మ్యాజిక్ చేశాడు. ఫుల్ మాస్ బీట్​తో బాలయ్య ఫ్యాన్స్​కు కిక్కించేలా ఈ సాంగ్​ను కంపోజ్ చేశాడు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. కరీముల్లా పాడారు. యూట్యూబ్​లో రిలీజైన గంటల్లోనే బాలయ్య ఆంథెమ్ రికార్డులను బ్రేక్ చేస్తోంది.

గోప్‌చంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘వీరసింహారెడ్డి’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌‌లో శరవేగంగా జరుగుతోంది. నిర్మాతలు ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.

రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన ఈ పాటలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్‌, వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో బాలకృష్ణలా మారిపోయి డ్యాన్స్ చేస్తుండటం చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. బాలకృష్ణ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో స్టైలిష్ గాగుల్స్‌ పెట్టుకుని అభిమానులకు కావాల్సిన విజువల్‌ ట్రీట్‌ అందిస్తూ..సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఎస్‌ థ‌మన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్‌తో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని తాజా సాంగ్‌తో అర్థమవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version