రజినీకాంత్ “జైలర్” తో హిట్ కొట్టేశాడు .. అదరగొట్టిన యోగిబాబు , అనిరుద్ !

-

ఈ రోజు ఎంతో ఘనంగా థియేటర్ లలో విడుదల అయిన జైలర్ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని తెరకెక్కించిన ఈ మూవీ మొదటి రివ్యూ వచ్చింది. సినిమాలో రజినీకాంత్ కు సరసన తమన్నా నటించగా మిగిలిన పాత్రలలో జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్ మరియు మోహన్ లాల్ లాంటి కీలక నటులు నటించారు. ఈ సినిమాలో రజినీకాంత్ యాక్షన్ చేసిన తీరు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుందని తెలుస్తోంది. ఇంకా కమెడియన్ యోగిబాబు తనదైన టైమింగ్ తో ఆడియన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టాడట.. ఇక పొద్దున్నుండి ఈ సినిమాలో ముఖ్యంగా వినిపిస్తున్న అంశాలలో అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ ఒకటి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడని టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి రజినీకాంత్ కు నెల్సన్ దిలీప్ కుమార్ సరైన టైం లో పర్ఫెక్ట్ హిట్ ను అందించాడు. రేపు రిలీజ్ కానున్న భోళా శంకర్ సినిమా టాక్ ను బట్టి జైలర్ మూవీ కలెక్షన్ ఆధారపడి ఉంటాయని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version