స్మృతి ఇరానీకి రాహుల్ ఫోబియా పట్టుకుంది : కాంగ్రెస్

-

కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ఇండియా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్​సభలో రెండ్రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం రోజున రాహుల్ గాంధీ ఈ అంశంపై మాట్లాడారు. అనంతరం లోక్​సభ నుంచి వెళ్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని బీజేపీ మహిళా ఎంపీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించింది. మణిపుర్ హింసపై చర్చకు రెడీగా లేని బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి రాహుల్‌ ఫోబియా పట్టుకొందని ఎద్దేవా చేసింది. బీజేపీ పార్టీ ఎంపీల విమర్శల నేపథ్యంలో శివసేన(యూబీటీ) నేత ప్రియాంకా చతుర్వేది రాహుల్ చర్యను సమర్థించారు. ‘తాను విజిటర్స్‌ గ్యాలరీలో ఉన్నానని.. రాహుల్ ఆత్మీయంగా ఆ సంజ్ఞ చేశారని.. దానిలో ఎలాంటి దురుద్దేశం కనిపించలేదని ప్రియాంక తెలిపారు. బీజేపీ ప్రేమను స్వీకరించలేదని అంటూ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version