ఏపీ గవర్నర్​ నియామకంపై కాంగ్రెస్​ విమర్శలు

-

ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అబ్దుల్ నజీర్ నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసిన వ్యక్తిని గవర్నర్​గా నియమించడమేంటని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ప్రశ్నించారు​. పలు కేసుల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినందుకే అబ్దుల్ నజీర్​కు గవర్నర్ పదవి కట్టబెట్టారని ఆరోపించారు.

2012వ సంవత్సరంలో దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. ట్విటర్​లో ఓ వీడియో పోస్ట్​ చేశారు జైరాం రమేశ్​. ‘తీర్పులు ఉద్యోగాలను ప్రభావితం చేస్తాయి. పదవీ విరమణకు ముందు ఇచ్చే తీర్పులు.. పదవీ విరమణ తర్వాత ఉద్యోగాలను ఇస్తాయి.’ అని ఆ వీడియోలో అరుణ్​ జైట్లీ అన్నారు.

దేశంలో గత మూడు, నాలుగేళ్లుగా ఇదే జరుగుతుందని జైరాం రమేశ్​ విమర్శించారు. దానికి ఈ నియామకాలే సరైన రుజువులు అని ఎద్దేవా చేశారు. ‘నాటి తీర్పులు వల్లే నేటి పదవులంటూ’ కేంద్రాన్ని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version