మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిలో ఉన్న సంప్ లు, ట్యాంక్ లు శుభ్రపర్చలని జల మండలి నిర్ణయం తీసుకుంది. ఇంటింటికీ బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయనుంది జల మండలి. ఇటీవలి భారీ వర్షాల కారణంగా ఇళ్ళలో ఉన్న సంప్ లోని నీరు వర్షపు నీటితో కలిసి ఉంటే, మీ సంపులు, ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్ర పరచాలని జల మండలి కోరుతోంది.
జల మండలి సరఫరా చేసే నీటితో నింపుకుని ఆ నీటిలో క్లోరిన్ మాత్రలను కలిపి నీటిని వాడాలని సూచన. ప్రతి ఇంటికి ఒక కిలో బ్లీచింగ్ పౌడర్, నీటితో కలపడానికి క్లోరిన్ మాత్రలను జలమండలి పంపిణీ చేస్తోంది. ఇతర వివరాలకు జల మండలి కస్టమర్ కేర్ 155313 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. వర్షాల నేపథ్యం లో నీటి సంపులు, ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రపరచిన తర్వాతనే ట్యాంకుల్లో నీటిని నింపుకోవాలని జలమండలి కోరుతోంది.