కక్ష్య లోకి జెమ్స్ వెబ్ టెలిస్కోప్…. భూమికి మిలియన్ కిలోమీటర్ల దూరంలో భారీ టెలిస్కోప్

-

నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని నాసా తన అధికారిక వెబ్ సైట్ ద్వారా వెల్లడించింది. దాదాపు నెలపాటు ప్రయాణించి అత్యంత స్థిరత్వం కలిగిన  లాగ్రాంజ్ పాయింట్-2 (L2) ఆర్బిట్ లోకి విజయవంతంగా జెమ్స్ వెబ్ టెలిస్కోప్ ను ప్రవేశపెట్టారు. 2021 డిసెంబర్ 25న ఏరియాన్ రాకెట్ ద్వారా టెన్నిస్ కోర్ట్ సైజులో ఉండే ఈ భారీ టెలిస్కోప్ ను నింగిలోకి ప్రవేశపెట్టారు. దాదాపు నెలపాటు విశ్వంలో ప్రయాణించి.. భూమికి 14 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న L2 కక్ష్యలో ప్రవేశపెట్టారు. జెమ్స్ వెబ్ లో ఉన్న థ్రష్టర్లను కొద్దిసేపు మండించి.. టెలిస్కోప్ వేగం తగ్గించడం ద్వారా.. టెలిస్కోప్ ను విజయవంతంగా ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు. ఎల్2 పాయింట్ వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు స్థిరంగా ఉండటంతో… జెమ్స్ వెబ్ టెలిస్కోప్ కు స్థిరత్వం లభిస్తుంది.

దాదపు మూడు దశాబ్ధాలుగా సైంటిస్టులు జెమ్స్ వెబ్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ఇప్పటికే హబుల్ టెలిస్కోప్ ద్వారా విశ్వాంతరాల్లోని ఎన్నో నిగూడ విషయాలను తెలుసుకున్నారు. హుబుల్ తో పోలిస్తే జెమ్స్ వెబ్.. వందరెట్లు శక్తివంతమైంది. జెమ్స్ వెబ్ ద్వారా బిగ్ బ్యాంగ్, తొలి సారిగా ఎర్పడ్డ గెలాక్సీలు, నక్షత్రాల పుట్టుక గురించి తెలుసుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version