Jamia Masjid: మసీదులో పూజకు అనుమతి ఇవ్వాలి… అది ఆంజనేయుడి ఆలయం

-

ప్రస్తుతం దేశంలో జ్ఞానవాపి మసీదు ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. వారనాసి కోర్ట్ మసీదును పూర్తిగా వీడియోగ్రఫి చేయాలని తీర్పు ఇవ్వడంతో ఒక్కసారిగా ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. కాశీ విశ్వనాథుడి ఆలయానికి సమీపంలో ఉండే జ్ఞానవాపి మసీదు ముందుగా దేవాలయం అని… మాకు పూజ చేసుకునే అనుమతి ఇవ్వాలని ఐదుగురు మహిళలు కోర్ట్ లో పిటిషన్ వేయడంతో కోర్ట్ వీడియోగ్రఫీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ నివేదికను మే 17న కోర్ట్ కు సమర్పించాలని ఆదేశం ఇచ్చింది. దీంతో ప్రస్తుతం జ్ఞానవాపి మసీదులో సర్వే జరుగుతోంది. 

ఇదిలా ఉంటే తాజాగా మరో మసీదు కూడా దేవాలయమే అని… కూల్చివేసి మసీదుగా మార్చారని, తమకు పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. కర్ణాటక మండ్యాలోని జామియా మసీదు ముందుగా ఓ ఆంజనేయుడి గుడి అని… తాము ఆంజనేయుడి విగ్రహానికి పూజ చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరుతూ రైట్ వింగ్ ఆక్టివిస్ట్ మాండ్యా డిప్యూటి కమిషనర్ మెమోరాండం ఇచ్చాడు. టిప్పు సుల్తాన్ కాలంలో ఇది ఆంజనేయుడి స్వామి ఆలయం అని, ఇదే విషయం టిప్పు సుల్తాన్, ఖలీఫాకు రాసిని లెటర్లలో కూడా ఉందని… దీన్ని ఆధారంగా చేసుకుని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version