కశ్మీర్ దహనం అవుతుండగా ఏం చేశారు.. ఫరూఖ్ అబ్దుల్లా పై అమిత్ షా ఫైర్..!

-

కశ్మీర్ దహనం అవుతుండగా ఏం చేశారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. రాజౌరీ జిల్లా నౌషేరాలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో  కేంద్ర హోం మంత్రి అమిత్ షా  ప్రతిపక్షాలపై మండిపడ్డారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కానీ  అధికారం వచ్చాక 370 ఆర్టికల్ ని పునరుద్ధరిస్తామని ఫరూక్ అబ్దుల్లా  చెబుతున్నారు. ఏ శక్తి కూడా ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురాలేదని వెల్లడించారు.

జమ్ము కశ్మీర్ లో 30 ఏళ్లుగా ఉగ్రవాదం కొనసాగింది. ఉగ్రవాదంతో దాదాపు 40 వేల మంది చనిపోయారు. కశ్మీర్ దహనం అవుతున్నప్పుడు ఫరూఖ్ అబ్దుల్లా ఏం చేశారు? ఫరూఖ్ సాబ్ లండన్ లో హాయిగా సెలవు తీసుకున్నారని ఫైర్ అయ్యారు అమిత్ షా. జమ్ము కశ్మీర్ ప్రాంతంలో బంకర్లు అవసరం లేదన్నారు. ఇప్పుడు కాల్పులు జరిపే సాహసం ఎవ్వరూ చేయలేరని.. ఎందుకంటే బుల్లెట్లకు బుల్లెట్లతోనే సమాధానం చెబుతామని హెచ్చరించారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Exit mobile version