జమ్మూ కాశ్మీర్ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు, పోలీసుల మధ్య జరుగుతున్న కాల్పుల గురించి తెలిసిందే. తాజాగా కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. లష్కరే తోయిబాకి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఇష్ఫార్ దార్ కూడా ఉన్నారు. వారి నుండీ ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమంలో భాగంగా షోపియాన్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసారు. ఇదే కాదు ఇప్పటికే పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత ప్రారంభమైంది. మొన్నటికి మొన్న ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో మరణించారు. కార్డన్ సెర్చ్ లో భాగంగా దొరికిన ఈ ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులకి దిగారు. ఆ తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించారు.