జనసేనకు ఎప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది: వరుణ్ తేజ్

-

కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’.ఈ చిత్రంలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.అయితే వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్ ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేనకు సపోర్ట్ గా ప్రచారం చేస్తారా? అని మీడియా ప్రశ్నించింది. దీనికి వరుణ్ స్పందిస్తూ.. ‘లాస్ట్ టైమ్ కూడా బాబాయ్, నాన్నకి సపోర్ట్ చేశాను. మా బాబాయ్ ఐడియాలజీపై నాకెంతో నమ్మకం ఉంది. జనసేన, బాబాయ్కి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.

ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్  మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్, మానుషీ జెట్ ఫైటర్స్ గా కనిపించబోతున్నారు.

వరుణ్ కెరియర్ లో మొట్టమొదటి హిందీ ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీ మీద చాలా ఆసక్తి కనబరుస్తున్నారు.ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version