అసలు పవన్ కళ్యాణ్ అంటే ఆశామాషి కాదు. పవన్ ఏదైనా ఒక పిలుపు ఇస్తే ఆ పిలుపుకి వచ్చే రెస్పాన్స్ ఆషామాషీగా ఉండదు. పవన్ సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, హిట్ అందుకున్నా, రాజకీయాల్లో ఓటమి చెందినా, ఇవేవి ఆయన అభిమానం అస్సలు పట్టించుకోరు. పవన్ అంటే అంతగా వారు అభిమానిస్తారు. ప్రేమాభిమానాలు కురిపిస్తారు. అసలు వారి అండదండలతోనే పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందినా పవన్ ఇంకా సీఎం అవుతాననే ఆశ లోనే ఉన్నాడు. పవన్ చిన్న పిలుపు ఇచ్చినా, ఆ పిలుపు అందుకుని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసే బాధ్యత ఆయన అభిమానులు తీసుకుంటారు.
పవన్ చేస్తుంది మంచా చెడా అనే విషయం వారు అసలు పట్టించుకోరు. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు పవన్ పిలుపును కూడా ఆయన అభిమానులు పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంపై జనసేన పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ధర్మ పరిరక్షణ దీక్ష పేరుతో, పవన్ దీపాలు వెలిగించాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. కానీ ఆ పిలుపును పవన్ అభిమానులు ఎవరూ పట్టించుకోకపోవడం, ఆ దీపం కాన్సెప్ట్ ఫెయిల్ అవ్వడం , అసలు దీపం కాన్సెప్ట్ పవన్ ఎందుకు పెట్టారు అనేది పూర్తిగా జన సైనికులకు అర్థం కాకపోవడం, ఇలా అనేేక కారణాలతో పవన్ పిలుపు వృధా అయింది.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం రథం దగ్ధం అయిన సంఘటనపై పవన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఏపీలో హిందుత్వంపై దాడి జరుగుతోందని, వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇలా ఎన్నో విమర్శలు చేశారు. బిజెపితో కలిసి నానా హంగామా సృష్టించారు. గతంలో తాను ప్రమోట్ చేసిన చేగువేరా కాన్సెప్ట్ ను సైతం పవన్ పక్కన పెట్టి బిజెపి అగ్రనేతల ప్రసన్నం పొందేందుకు అన్నట్టుగా హిందుత్వాన్ని పవన్ ప్రమోోట్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే, అంతర్వేది సంఘటనకు నిరసనగా, దీపాలు వెలిగించాలని పిలుపు ఇచ్చినా పెద్దగా స్పందన రాకపోవడం, చేగువేరా భావజాలం నుంచి ఒక్కసారిగా హిందూ భావజాలంలోకి పవన్ మారినంతగా అభిమానులు మారకపోవడం, ఇవన్నీ పవన్ దీపం కాన్సెప్ట్ ను దెబ్బతీశాయి.
అసలు పవన్ ఏ క్షణంలో ఏం చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొనడంతో ఆయన అభిమానులను, జనసేన కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతుంది. అయితే ఎక్కడ అది బయటపడకుండా వారు జాగ్రత్త పడుతూ వస్తున్న కొన్ని సందర్భాల్లో ఇలా బహిరంగం అవుతోంది.
-Surya