దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ నేతలు : జనసేన ఇంచార్జ్

-

వైసీపీ నేతలు గంజాయి తాగి ఒకరిని ఒకరు కోట్టుకున్నారు . కానీ కార్పోరేటర్లపై వారే దాడి చేసి కిడ్నాప్ చేశారంటూ డ్రామాలు ఆడారు అని జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. ఓ మహిళ ఎస్సై నీ వైసీపీ నేతలు దాడి చేసి భూతులు తిట్టారు‌‌. నలుగురు కిడ్నాప్ అయ్యారంటూ భూమన కరుణాకర్ రెడ్డి అరచి గీపెట్టాడు‌‌‌. కానీ నలుగురు కార్పోరేటర్లు సేఫ్ గా ఉన్నామని చెప్పారు.

కానీ వాళ్ళు కిడ్నాప్ అయ్యారంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. డిప్యూటీ మేయర్ పదవి కోసం ఇప్పటికి రకరకాల డ్రామాలు భూమన కుటుంబ ఆడింది. వైసీపీ కార్పోరేటర్ల అందరు కూటమీ జై కోట్టాడానికి సిద్దంగా ఉన్నారు. అభినయ్ రెడ్డి వెంట ఉండే వారందరూ 420లే.. పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి. భూమన కరుణాకర్ రెడ్డి కోడుకు కోసం నోటికోచ్చిన అబద్దాలు చేప్పాడు. దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ నేతలు. ఏ ఎన్నికలు జరిగినా దోంగ ఓట్లు వేసేది మీరే కదా. కరుణాకర్ రెడ్డి అనుచరుల దాడులు తట్టుకోలేక భయపడి పారిపోయారు‌‌‌. వైసీపీ నేతల రేపు పెద్ద ఎత్తున గోడవలు చేయడానికి సిద్దమయ్యారని సమాచారం ఉంది. అయితే వైసీపీ నేతలు ఎన్ని చెప్పినా రేపు విజయం మాదే అని జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version