నెల్లూరు జిల్లాలో మరో ఆసక్తికర మలుపులకు తెరలేచింది అని చెప్పాలి. నిన్న మొన్నటి వరకు జనసేన తరపున కేతంరెడ్డి వినోద్ రెడ్డి 2019 లో సిటీ ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేతం రెడ్డి నెమ్మదిగా తన బలాన్ని పెంచుకునే పనిలో ప్రజలలో తిరుగుతూ ఉన్నాడు. మరో ఆరు నీళ్లలో ఎన్నికలు జరగనుండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పోటీ చేయనున్నాడని ప్రకటించగానే, చాలా మంది జనసేన నాయకుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందులో భాగంగానే కేతం రెడ్డి వినోద్ రెడ్డి జనసేన కు రాజీనామా చేసి ఈ రోజు విజయసాయి రెడ్డి మరియు మంత్రి కాకాని సమక్షములో వైసీపీలో జాయిన్ అయ్యారు.
పవన్ ముఖ్యమంత్రి అవుతారన్న నమ్మకంతోనే ఇన్నాళ్లు జనసేనలో ఉన్నానని ఇప్పుడు సీఎం పదవిని చంద్రబాబుకు ఇచ్చే తప్పుడు నేనుండి ఉపయోగం లేదనుకుని వెళ్లిపోతున్నా అంటూ కారణాన్ని చెప్పాడు కేతం రెడ్డి. మరి కేతంరెడ్డికి వైసీపీలో ఏ స్థానాన్ని కల్పించనున్నారు అన్నది తెలియాల్సి ఉంది.