తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రజలను కలవర పెడుతుంది… ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, మరెందరో ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితి నుండి ప్రజలు త్వరగా కోలుకోవాలని జన జీవన స్రవంతి తిరిగి పుంజుకోవాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థించాడు జనసేన అధ్యక్షుడు జనసేనాని పవన్ కళ్యాణ్. జనాలకు కష్టం వస్తే జనసేనానికి కూడా కష్టం వచ్చినట్టే అని అందరూ కరోనా నుండి కష్టకాలం అనుభవిస్తుంటే తాను కూడా అదే కష్టకాలం అనుభవిస్తానని ఆయన చతుర్మాస దీక్షను చేపట్టారు. కరోనా నుండి ప్రజలు కొల్కోవాలని అందరి పరిస్థితి మెరుగుపదాలని ఆయన భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ దీక్షను ప్రారంభించారు.
రాబోయే నాలుగు నెలలపాటు ఆయన కేవలం ఒక్క పుట మాత్రమే భోజనం చేస్తాడు. చతుర్మాస దీక్ష అంటే ఏక బుక్తి తో కూడుకున్న దీక్ష. దీంతో పవన్ రాబోయే నాలుగు నెలలు ఏకభుక్తి నియమ పాటిస్తాడు. నాలుగు నెలల పాటు దీక్షను చేయాలని పవన్ నిర్ణయించారు. ఈ దీక్ష కాలం అంతా కూడా ఆయన ఓ సాధారణ జీవనాన్ని గడపాలి. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ సినిమాలో నటించాడు కరోనా నేపద్యంలో సినిమా రిలీజ్ ఆగిపోయింది. త్వరలో మన ముందుకు వకీల్ సాబ్ లా వచ్చి మనని అలరించనున్నాడు.