మరో బడా స్టార్ హీరో సినిమాలో జాన్వీ కపూర్.. లక్ మామూలుగా లేదుగా..?

-

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ధడక్ అనే సినిమా ద్వారా హిందీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది . ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాలో హీరోయిన్గా నటిస్తూ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. అయితే ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలే కాలేదు ఇప్పుడు మరో బడా స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులో ఎప్పటినుంచో ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన జాన్వి కపూర్ ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతో దక్షిణాదిలో తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఈ విషయమై ఎంతో ఆనందంగా ఉంది అంటూ తెలిపింది జాన్వీ కపూర్. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా త్వరలోనే తెలియాల్సి ఉంది. జాన్వి కపూర్ విషయానికి వస్తే ఈ బాలీవుడ్ అందం ఫోటో షూట్లతో పాటు అప్పుడప్పుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు , వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫోన్లో మరింత పెంచుకుంటుంది. దీంతో ఆమె ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇకపోతే ఇంస్టాగ్రామ్ లో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఫ్యాషనిస్ట్ కూడా .. ఇక జాన్వీ ని ఒకరకంగా బాగానే వాడుకుంటున్నారని తెలుస్తుంది. తమ తమ క్రియేటివ్ కాస్టూమ్స్ కి జాన్వితో యాడ్స్ చేయించుకుంటూ ఆమెను యూత్ స్టైల్ ఐకాన్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు మరొకసారి అదరగొట్టేసింది. అదిరిపోయే లుక్కులో మరొకసారి అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version