అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటించింది తక్కువ సినిమాల్లోనే అయినప్పటికీ స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ సుందరి..సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంటుంది.
తాజాగా జాన్వీకపూర్ షేర్ చేసిన వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సదరు వీడియోలో జాన్వీకపూర్ ధరించిన డ్రెస్సు చర్చనీయాంశమవుతున్నది. కంప్లీట్ రెండ్ కలర్ డ్రెస్సులో జాన్వీకపూర్ ఎరుపు రంగుల్లో కైపెక్కిస్తున్నది.
టైట్ ఔట్ ఫిట్ లో జాన్వీకపూర్ అందాలు క్లియర్ గా కనబడుతున్నాయి. దాంతో నెటిజన్లు దాగని అందాలను ఎరుపు డ్రెస్సులో దాస్తున్నదని అంటున్నారు. బ్లాక్ కలర్ లైట్ కోట్ కప్పుకుంటూ జిమ్ నుంచి బయటకు వస్తున్న జాన్వీకపూర్ అందాల ఆరబోత వీడియో చూసి నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. రెడ్ డ్రెస్సులో అలా కనబడుతున్న జాన్వీకపూర్ బ్యాంక్ ఎంప్లాయి అయిపోయిందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక మిగతా వారు సైతం జాన్వీ చాలా అందంగా ఉందని, గ్లామర్ క్వీన్ అని పోస్టులు పెడుతున్నారు.