ప్రపంచానికే ఆమె పెద్దమ్మ…..ఇది మామూలు రికార్డ్ కాదు..!!

-

ప్రత్యేకమైన పనులు చేస్తూ కొందరు ప్రపంచ రికార్డ్స్ సృష్టిస్తున్నారు. ఒక బామ్మా కూడా అలానే రికార్డు సృష్టించింది. అది మాత్రమే కాదు, గతంలో తన పేరుమీద ఉన్న రికార్డును తానే బద్దలుకొట్టి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది ఈ బామ్మా. నిన్న కాకా మొన్ననే ఈ బామ్మా జపాన్ లో 117 వ పుట్టినరోజు జరుపుకుంది. అసలు ఈ బామ్మా ఎవరు ఈమె బద్దలు కొట్టిన రికార్డు ఏంటో తెలుసా…

ఆ బామ్మా పేరు, కానె తనక. గతేడాది మార్చి 9న గిన్నీస్ బుక్ వారు ప్రపంచలో జీవించి ఉన్న అంత్యంత ఎక్కువ వయసు మహిళగా కానె కు గుర్తింపు ఇచ్చారు. ఈ సంవత్సరం ఫుక్వోకాలో కానే కుటుంబ సభ్యలు, స్నేహితులతో పాటు తన 117 వ పుట్టినరోజు వేడుకలని జరుపుకుంది ఈ బామ్మా . అంటే గత తన ప్రపంచ రికార్డు తానే తిరగ రాసింది.

 

నిజానికి తన పుట్టిన రోజు జనవరి 2, కాని అందరికి ఆదివారం వీలు కుదురుతుంది కదా అని ఆరోజు పార్టీ చేసుకుంది. 1903 లో జన్మించిన తనక,1922 లో హిడియోను పెళ్లిచేసుకుంది. వాళ్ళకు నలుగురు పిల్లలు,మరొకరిని దత్తత తీసుకున్నారు. జపాన్ లో వృద్ధుల సంఖ్య అధికం. ఏట అక్కడ పుట్టే పిల్లల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. జపాన్ లో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఎక్కువ, అక్కడి వైద్య సదుపాయాలు ఎంతో అందుబాటులో ఉంటాయి. జపాన్ ప్రజల ఆరోగ్యం పట్ల అక్కడి ప్రభుత్వాలు ఎంతో కటినమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్య విషయంలో రాజీపడకుండా వ్యవహరిస్తాయి. 

 

  

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version