జపాన్‌లో ఎట్టకేలకు కొత్త ప్రధాని ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. కొత్త ప్రధానిగా యోషిహిడే సుగా బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ సోమవారం ఆయనను తమ నేతగా ఎన్నుకున్నది. బుధవారం సుగాను జపాన్ ప్రధానిగా అధికారికంగా ప్రకటించనున్నారు. ఆయన 2021 సెప్టెంబరు దాకా పదవిలో కొనసాగుతారు.
ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా కొనసాగుతున్న షింజో అబే అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేసిన విష యం తెలిసిందే. చాలా రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు రేపటితో తెరపడనుంది.