ముంచుకొస్తున్న ’జవాద్‘ తుఫాన్… రెండు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

-

రాష్ట్రానికి  ’జవాద్‘ తుఫాన్  ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే వాయుగుండంతో దక్షిణ కోస్తా, రాయలసీయ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజగా థాయ్‌లాండ్, అండమాన్‌ నికోబార్‌ తీరం వద్ద శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుకుని 15వ తేదీ నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత మరింత బలపడి ఏపీ తీరంలో 17, 18 తేదీల నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది ఏపీ తీరానికి 12 వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ జిల్లాలపై ఎక్కువగా ఉండనుంది. రేపటి నుంచి ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 16న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 17 నుంచి తీరం దాటే వరకూ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఎవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చిరిస్తున్నారు.

దీంతో పాటు ఒడిశా దక్షిణ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గజపతి, గాజాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చిరిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version