హుజురాబాద్ ఎన్నికల ఖర్చు పై జయ ప్రకాష్ నారాయణ్ షాకింగ్ కామెంట్స్ చేసారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉభయ పార్టీలు పెట్టిన ఖర్చు కంటే హుజురాబాద్ లో పెట్టిన డబ్భులు ఎక్కువ అంటూ జయప్రకాశ్ నారాయణ్ వ్యాఖ్యానించారు. రాజకీయాలు రోజు రోజు దిగజరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ చరిత్రలో దళిత బంధు తరహాలో ఎక్కడ ఇంత డబ్భు వృధా అవలేదు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. పది లక్షల రూపాయలు అంటే అమెరికాలో అరవై వేల డాలర్లు అని వ్యాఖ్యానించారు.
విద్య , ఉద్యోగం , ఉపాధి అవకాశాల్లో పెట్టాల్సిన డబ్బును ఇలా ఇవ్వడం అనైతికంగా వాడుతున్నారు అంటూ జయప్రకాశ్ నారాయణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన అవకాశాలు ఇవ్వల్సింది పోయి నేరుగా లక్షల రూపాయలను ఇవ్వడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అంటూ ఆయన మండి పడ్డారు. అంతే కాకుండా ఉచిత వైద్యం అందించే ఓ పతాకాన్ని రూపొందించా అని త్వరలోనే దానిని తెలుగు రాష్ట్రాల తో పాటు ఇతర రాష్ట్రాల సీఎం లకు చెబుతా అని తెలిపారు.