చాలా రోజుల అనంతరం మీడియా ముందుకు వచ్చిన జేసీ దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాలు తర్వాత ప్రభోధనంద ఆశ్రమం పై కేసును రెండు సంవత్సరాలుగా వాడుకుంటున్నారని అన్నారు. ప్రభాకర్ రెడ్డి కులం పేరుతో సి ఐని దూషించినట్లు తప్పుడు కేసు పెట్టారు…అతని కులం ఇప్పటికీ తెలియదని ఆయన అన్నారు. ఎస్సి ఎస్టీఅట్రాసిటీ కేసు బ్రహ్మాస్త్రం గా మారిందన్న ఆయన మా ఇంట్లోనే కులాంతర వివాహాలు చేసుకున్నాం… ఇంకా కులం ఎక్కడ వుంది ? అని ప్రశ్నించారు.
అట్రాసిటీ కేసును రాజకీయంగా వాడుకుంటున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని ఎన్నికల సమయంలో కేసులు పెట్టి లోపల వేసేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు. అట్రాసిటీ కేసును పరిష్కరించే వరకు ఈ నెల 4నుంచి తాడిపత్రిలో అమరణ దీక్ష చేస్తున్నామని అన్నారు. అలానే అమరావతి రాజధాని కోసం నిరసన చేస్తున్నారన్నది ప్రధాన మంత్రి కి తెలుసో తెలియదోనని, అమరావతి రైతులతో ప్రాథమిక చర్చలు కూడా జరపడం లేదని అన్నారు. శ్రీకాకుళం, వైజాగ్ మినహా అన్నీ ప్రాంతాల వారు అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్నారన్న ఆయన అమరావతి రాజధాని కోసం ఆమరణ దీక్ష కు సిద్ధంగా వున్నానని అన్నారు.