మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తాడిపత్రి మాజీ తేదేపా శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి “మన ఊరు – మనం కాపాడుకుందాం” అనే నినాదంతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మరో పక్క వైసీపీ అభ్యర్థులు సైతం ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఈ ప్రచారంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి నాయకులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. జెసి ప్రభాకర్ రెడ్డి నానో కారును ప్రచార రథంగా తయారు చేయిస్తున్నారు.
మునిసిపల్ ఎన్నికల ప్రచారం మొత్తం నానో కారు ప్రచార రథం ద్వారానే నిర్వహించడానికి సిద్ధమ్తెయ్యారు. ఇక ఈ ఉదయం జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం ,వైసిపి మధ్య ఎన్నికలు జరిగాయి అనుకుంటున్నారని అది తప్పని అన్నారు. చంద్రబాబు ను చూసి జగన్ చూసి ఓట్లు వేయలేదని గ్రామంలో నాయకుడిని చూసి ఓట్లు వేశారని అన్నారు. 2000 ఇచ్చావా 2,500 ఇచ్చావా అనే చూశారు తప్ప వ్యక్తులు వారి పాలసీలు మధ్య జరిగిన ఎన్నికలు కావని అన్నారు.