హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని ప్రభుత్వం వేలం వేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జేసీబీలను వర్సిటీ లోనికి పంపించి అక్కడున్న దట్టమైన చెట్లను రాత్రంతా నరికి వేయించారు.దీనిపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే, మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హెచ్‌సీయూ భూములపై మంత్రి శ్రీధర్ బాబు చేసిన వ్యాక్యలను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ‘అసెంబ్లీ సాక్షిగా ఒక్క ఇంచు భూమిని కూడా తీసుకోబోమని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించి.. వారం కూడా దాటాక ముందే HCU భూములపైకి కాంగ్రెస్ బుల్డోజర్లు వెళ్లాయని’ నెటిజన్లు విమర్శిస్తునన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదోకటి చేసేదొకటి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
దొంగ మాటలు మాట్లాడటంలో ఒకరినిమించి ఇంకొకరు ఉన్నట్టున్నారు కాంగ్రెస్ పార్టీలో.
అసెంబ్లీ సాక్షిగా ఒక్క ఇంచు భూమిని కూడా తీసుకోబోమని చెప్పిన కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు.
అసెంబ్లీ ముగిసి వారం దాటాక ముందే HCU భూమలపైకి కాంగ్రెస్ బుల్డోజర్లు.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదోకటి… https://t.co/pbpthHy2Uc pic.twitter.com/0mQThUI932
— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) March 31, 2025