మోడీ మెడలు వంచుతా అన్న కేసీఆర్…మెడలు వంచుకుని వచ్చాడు జీవ‌న్ రెడ్డి

-

రైతాంగం నుండి ధాన్యం సేకరించాల్సి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందేన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జీవ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు. చివరి గింజ వరకు నేనే కోంట అని గొప్పలు చెప్పిన కెసిఆర్… ఇప్పుడు కేంద్రం సహకరించడం లేదు అంటున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం అడగక ముందే.. తెచ్చిన ప్రతీ బిల్లుకు మద్దతు చెప్పింది నువ్వే కదా అంటూ కేసీఆర్ పై సెటైర్ వేశారు. మోడీ మెడలు వంచుతా అన్న కెసిఆర్…మెడలు వంచుకుని వచ్చాడు అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు.

ప్రధాని అప్పాయింట్ మెంట్ కూడా కోరలేదు…నీకు రైతు సమస్యలపై చిత్త శుద్ది ఉంటే జంతర్ మంతర్ వద్ద ధర్నా కు కూర్చునే వాడివి అంటూ మండిప‌డ్డారు. ధాన్యం సేకరణపై ఒక్క సారి అయినా… కలెక్టర్ లతో మాట్లాడి నవా..? అంటూ జీవ‌న్ రెడ్డి కేసీఆర్ ను ప్ర‌శ్నించారు. మిల్లర్లు..ప్రభుత్వo కుమ్మక్కు అయ్యారని… ఇద్దరు కుమ్మక్కై..రైతును ఇబ్బందికి గురిచేస్తున్నారంటూ జీవ‌న్ రెడ్డి ఆరోపించారు. రబీ లో ఏం వేయాలన్నా దానికంటే… ఖరీఫ్ లో పండించిన పంట కొను ముందు అంటూ స‌లహా ఇచ్చారు. కేంద్రం..కొనను అంటే రైతులను ఏం చేస్తారు కెసిఆర్ అంటూ ప్ర‌శ్నిచారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version