సింగ‌ర్ హ‌ర్షిణి తండ్రి మృతికేసులో సంచ‌ల‌నాలు..!

-

సింగ‌ర్ తండ్రి ఏకే రావ్ అనుమానాస్పద మృతి కేసు లో బెంగుళూరు రైల్వే పోలీసుల విచార‌ణ కొన‌సాగుతుంది. గిరీష్ స్టేట్మెంట్ ను బెంగుళూర్ పోలీసులు రికార్డ్ చేశారు. సిద్దగుంట పాళీ పీఎస్ లో నమోదు అయిన 150 కోట్ల చీటింగ్ కేసు ఆధారం గా విచారణ జ‌రుగుతోంది. ఏకే రావ్ ను వేధించిన వ్యక్తుల ఫై పోలీసులు ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ రికార్డ్ ను పోలీసులు తీసుకోనున్నారు.డానియల్ ఆర్మ్ స్ట్రాంగ్ , వివేకానంద, రాఘవన్ ల పైనే ఏకే రావ్ కుటుంబ సభ్యులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

singer varshini father muder case update

150 కోట్ల వ్యవహారం లో గిరీష్ కోసం మధ్యవర్థివత్వం ఏకే రావు మ‌ధ్య‌వ‌ర్తిత్వం పై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఏకే రావ్ సెల్ ఫోన్ కాల్ డేటాను పోలీసులు సేక‌రిస్తున్నారు. ఇక ఈ రోజు పోలీసుల ముందుకు ఏకే రావ్ కుటుంబ సభ్యులు రాబోతున్నారు. ఈ సంధ‌ర్బంగా వారి స్టేట్మెంట్ ను రికార్డు చేస్తారు. ఇదిలా ఉండ‌గా నిన్న ఏకే రావు రైల్వే ట్రాక్ పై అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఏకే రావు కుమార్తె వ‌ర్శిణి ప్ర‌ముఖ సింగర్ కావ‌డంతో ఈ వార్త కాస్తా సంచ‌ల‌నంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version