కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పంచ పాండవులు మిగిలారన్నారు. కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడని.. సిఎల్పీ నేత ధర్మరాజు, జగ్గారెడ్డి..భీముడని.. శ్రీధర్ బాబు…అర్జునుడని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి కి అసెంబ్లీ తో బంధం తెగిపోయిందని.. చచ్చిన టీఆర్‌ఎస్ బతికించే పనిలో రాజగోపాల్ రెడ్డి పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజగోపాల్ రెడ్డి రాజీనామా…వల్ల టీఆర్‌ఎస్ కు బలం పెంచుకునే అవకాశం ఇచ్చినట్టు అయ్యిందన్నారు. మునుగోడు లో మేము గెలిస్తే అధికారం లోకి వచ్చినట్టేనని.. అభ్యర్ధిని పిసిసి నిర్ణయిస్తారని వెల్లడించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రజలు ఎలా చూస్తారు అనేది చూడాలని.. రాజీనామా తో అభివృద్ధి అనేది కరెక్ట్ వ్యూహం కాదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే రాజీనామా చేయడం అంటే చేత కానీ తనమని.. అందరూ ప్రెసిడెంట్ కాలేరని చురకలు అంటించారు. మూడేళ్లుగా రాజగోపాల్ రెడ్డి చేసిన ఉద్యమం ఎంటి ? ఎమ్మెల్యే గా ఉద్యమం చేస్తుంటే వద్దని కాంగ్రెస్ అన్నదా..? అని నిలదీశారు.