Breaking : సైబర్‌ నేరగాళ్ల వలలో జీవితారాజశేఖర్‌

-

సైబర్‌ నేరగాళ్లు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతికి సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా చిక్కుతున్నారు. మామూలుగా డబ్బు ఆశ చూపి సైబర్ నేరగాళ్లు సామాన్యుల వద్ద ఉన్న డబ్బు కొట్టేస్తూ ఉంటారు కానీ ఈసారి జీవితారాజశేఖర్‌కు సైబర్‌ నేరగాళ్లు కుచ్చు టోపీ పెట్టారు. జియో బహుమతుల పేరుతో లక్షన్నర రూపాయల మేర జీవితారాజశేఖర్‌కు సైబర్‌ నేరగాళ్లు మోసం చేసినట్టు తెలుస్తోంది. సగం ధరకే జియో బహుమతులు ఇస్తామంటూ ఛీటింగ్‌ చేశారని, అలా తెలిసినవారి పేరు చెప్పి జీవితారాజశేఖర్‌కు టోకరా వేశారని అంటున్నారు.

తెలిసినవాళ్లని నమ్మి లక్షన్నర రూపాయలు బదిలీ చేసిన జీవిత మేనేజర్ ఆ డబ్బులు చెల్లించిన తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు చెన్నైకి చెందిన నరేష్‌ని అరెస్టు చేసి అతన్ని విచారించారు. ఈ సమయంలో సైబర్‌క్రైమ్ పోలీసులు నరేష్ గతంలోనూ నటీనటులతోపాటు ప్రొడ్యూసర్స్‌ని మోసం చేసినట్టు గుర్తించారు. టాలీవుడ్‌లో ఉన్న అతికొద్ది మంది మ‌హిళాద‌ర్శ‌కుల్లో ఒక‌రు జీవితారాజ‌శేఖ‌ర్. ఆమె డైరెక్ష‌న్‌లో రాజశేఖ‌ర్ తాజాగా శేఖ‌ర్ అనే సినిమాలో నటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version