జో బైడెన్, ప్రధాని మోదీ సమావేశం.. కీలక ఆంశాలపై చర్చ

-

ఢిల్లీలో జి20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ ద్వైపాక్షిక చర్చలో కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని మోదీ నివాసంలో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. రేపు ప్రారంభం కానున్న జీ20 సదస్సుకు ఒకరోజు ముందు ఇరు దేశాల మధ్య సత్సంబంధాల బలోపేతంపై చర్చలు ఉంటాయని ప్రధాని కార్యాలయం తరపున ట్వీట్ చేసింది.మరో రెండు రోజుల్లో ప్రధాని కనీసం 15 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

జీ 20 దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలపై సమీక్ష, అభివృద్ధికి సహకారం మరింత బలోపేతం దిశగా చర్చలు నిర్వహించనున్నారని ప్రధాని మోదీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.పేదరిక నిర్మూలన, పెంపుదల వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ సంస్థల ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించే ప్రతిపాదన, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకుల (MDB) సంస్కరణలు జో బైడెన్ కృషి చేస్తారని US జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు. సంక్షేమం, వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంపై దృష్టి సారిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో యూఎస్ తరపున ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్, విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్, ఎన్‌ఎస్‌ఎ జేక్ సుల్లివన్, భారత ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి జైశంకర్, ఎన్ఎస్ఎ అజిత్ దోవల్ పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version