శ్రీదేవి డాటర్‌కు బిగ్ చాన్స్.. స్టార్ హీరోతో జాన్వికపూర్ రొమాన్స్..

-

అతి లోక సుందరి శ్రీదేవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక శ్రీదేవి నటించిన తెలుగు సినిమాలన్నీ దాదాపుగా సూపర్ హిట్ ఫిల్మ్స్ కావడం విశేషం. అటువంటి లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి వారసురాలిగా జాన్వికపూర్ బీ టౌన్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి వరకు జాన్వి చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అయితే పొందింది.

మరాఠి సూపర్ హిట్ ఫిల్మ్ ‘సైరట్’ను హిందీలో రీమేక్ చేసి సక్సెస్ అయ్యారు మేకర్స్. అందులో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసిన జాన్వి కపూర్.. ఆ తర్వాత చక్కటి అవకాశాలను దక్కించుకుంది. అయితే, ఇప్పటి వరకు ఈ భామ స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించలేదు. తాజాగా ఈ భామకు చక్కటి అవకాశం వచ్చింది. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ నితీశ్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘బవాల్’ చిత్రంలో కథనాయికగా జాన్వికపూర్ సెలక్ట్ అయింది.

ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. దాంతో జాన్వికపూర్ సంతోషం వ్యక్తం చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పిక్చర్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలోనే జరగబోయే షూటింగ్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసే ఆర్టిస్ట్ గా జాన్వికపూర్ పాల్గొననుంది. జాన్వికపూర్ ఇప్పటి వరకు ‘ధడక్, దోస్తానా 2, గుడ్ లక్ జెర్రీ, మిలీ, రూహి, గుంజన్ సక్సేనా’ చిత్రాల్లో నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version