తెలంగాణలో ఎన్నికలు వేడిపెంచుతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఆయా పార్టీలను వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. భువనగిరి కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ భువనగిరిలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో సీఎం కేసీఆర్ కండువా కప్పి జిట్టాను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఇటీవలే బాలకృష్ణారెడ్డిని బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన కాంగ్రెస్‌లో జాయన్ అయ్యారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు.
అయితే.. ఆయనతో పాటు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం కాషాయాన్ని వీడారు. ఇటీవలే ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యే టికెట్లను ఆశించారు. ఇదే హామీపై వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఏఐసీసీ ఎన్నికల స్క్రినింగ్ కమిటీ సంచలన ప్రకటన చేసింది. 119 సీట్లకు గాను 55 సీట్లకు సంబంధించి అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను వెల్లడించింది. ఈ లిస్టులో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన 20 మంది నేతలకు టికెట్లు దక్కాయి. ఇందులో 17 మంది రెడ్లకు దక్కడం విశేషం. ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణా రెడ్డికి మంచి పేరుంది. ఈ తరుణంలో తను కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలో జంప్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.