హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (TIMS)లో ఉద్యోగాల భర్తీకి గాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 499 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నర్సింగ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ / హెడ్ నర్స్, స్టాఫ్ నర్స్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, డైటీషియన్, బయో మెడికల్ ఇంజనీర్, ఫార్మసీ సూపర్‌వైజర్ ఓపీ / ఐపీ, మెడికల్ రికార్డ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
కాగా ఇవి ఏడాది కాలం పోస్టులు. వీటికి గాను దరఖాస్తుల ప్రక్రియను మంగళవారం ప్రారంభించారు. ఇక దరఖాస్తు చేసేందుకు జూన్ 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://mhsrb.telangana.gov.in/ అనే వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు.
టిమ్స్‌లో ఉన్న ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఖాళీలు- 499
ప్రొఫెసర్- 14
అసోసియేట్ ప్రొఫెసర్- 24
అసిస్టెంట్ ప్రొఫెసర్ – 48
సివిల్ అసిస్టెంట్ సర్జన్- 129
నర్సింగ్ సూపరింటెండెంట్- 1
అసిస్టెంట్ డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ / హెడ్ నర్స్- 20
స్టాఫ్ నర్స్- 246
డైటీషియన్- 1
బయో మెడికల్ ఇంజనీర్- 1
ఫార్మసీ సూపర్‌వైజర్ ఓపీ / ఐపీ- 2
ఫార్మాసిస్ట్- 12
మెడికల్ రికార్డ్ ఆఫీసర్- 1
ముఖ్యమైన వివరాలు…
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైన తేదీ – జూన్ 16, 2020
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ – జూన్ 19, 2020, సాయంత్రం 5 గంటల వరకు
విద్యార్హతలు – పోస్టులను బట్టి విద్యార్హతలు ఉండాలి
వయస్సు – 18 నుంచి 34 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు