మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ బ్యాంక్ ఉద్యోగుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎక్స్ సర్వీస్‌మెన్ లకి ఇండియన్ బ్యాంక్ గుడ్ న్యూస్ ని అందించింది.
చెన్నై కేంద్రంగా పని చేసే ఈ బ్యాంక్ దేశవ్యాప్తంగా సెక్యూరిటీ గార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. దీనిలో మొత్తం 202 సెక్యూరిటీ గార్డ్ పోస్టులు వున్నాయి. కనుక అర్హత వున్నా వాళ్ళు అప్లై చేసుకుంటే ఉద్యోగాన్ని పొందొచ్చు.
ఇక వయస్సు విషయానికి వస్తే.. అప్లై చేసుకోవాలని అనుకునే వారి వయసు 26 ఏళ్లు మించకూడదు. అలానే పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒకవేళ అలా కాదు అంటే ఆర్మీ/నేవీ/ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో ఎక్సీ సర్వీస్‌మెన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది.
ఇక ఎంపిక విధానం ఎలా ఉంటుంది అనేది చూస్తే.. అభ్యర్థులను ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ని చూసి దీని ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. టెస్ట్ ఆన్ లైన్ మోడ్ లో ఉంటుంది. ఈ పరీక్షను మొత్తం 40 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 90 నిమిషాలు.
అలానే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కును తగ్గిస్తారు. కనుక అభ్యర్థులు దీనిని గమనించడం మంచిది. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 09-03-2022. కనుక ఈలోగా అప్లై చేసుకోండి. పూర్తి వివరాలను https://www.indianbank.in లో చూసి అప్లై చేసుకోచ్చు.