ఆ బ్యాంక్ లో ఉద్యోగాలు..పూర్తీ వివరాలు ఇవే..

-

బ్యాంక్ లో ఉద్యోగం చేయాలని అనుకోనేవారికి గుడ్ న్యూస్..ప్రస్తుతం వరుస బ్యాంక్ ఉద్యొగాల నోటిఫికేషన్ లు విడుదల అవుతున్నాయి.తాజాగా మరో బ్యాంక్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ)లో అసిస్టెంట్ మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఐడీబీఐ బ్యాంక్ బెంగుళూరులోని మణిపాల్, గ్రేటర్ నొయిడాలోని నిట్టే విద్యాసంస్ధలతో కలసి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా లో ట్రెయినింగ్ ఇస్తారు.

ఆ కోర్సులు పూర్తీ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను ఇస్తారు.ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 1544 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో ఎగ్జిక్యూటివ్ లు 1044, అసిస్టెంట్ మేనేజర్లు 500 ఖాళీలు ఉన్నాయి.అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, కంప్యూటర్ ఆపరేషన్స్ , లాంగ్వేజలో డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 20 నుండి 25 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 21 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి ఆన్ లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తుల స్వీకరణ జూన్ 3 నుంచి ప్రారంభం అవుతుంది.దరఖాస్తులకు చివరి తేది 17 జూన్ , 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.idbibank.in/ పరిశీలించగలరు.నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాలని మనవి..

Read more RELATED
Recommended to you

Exit mobile version