మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ లో ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. NISD ఒప్పంద ప్రాతిపదికన స్టేట్ కో ఆర్డినేటర్ పోస్టులను భర్తీ చెయ్యడానికి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 24 ఖాళీలు వున్నాయి. పోస్టుల వివరాల లోకి వెళితే… ఈ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ కో ఆర్డినేటర్ పోస్టులును భర్తీ చేస్తున్నారు. వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 28 ఏళ్ళు మించకూడదు. ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అప్లై చేసుకోవాలని అనుకునే వారు సోషల్ వర్క్‌లో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అదే విధంగా పని లో అనుభవం కూడా తప్పని సరిగా ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
ఇక అప్లై చేసుకోవాలి అనేది చూస్తే.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చెయ్యచ్చు. అప్లై చెయ్యడానికి చివరి తేదీ ఏప్రిల్ 30, 2022. ఇంటర్వ్యూ ని జూన్ 20 కంటే ముందు నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి వివరాలను http://socialjustice.gov.in/ లో చూడచ్చు.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.