మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో వున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యాను ఫ్యాక్చరింగ్ పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
మరి ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే… 27 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా వున్నాయి. ఇక పోస్టుల వివరాలను చూస్తే… కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మ్యాథ్స్/ఫిజిక్స్ స్ట్రీమ్స్‌లలో మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ సైన్సెస్ విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి.
ఇక అర్హత వివరాలను చూస్తే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పీహెచ్‌డీ ప్యాస్ అయ్యి ఉండాలి. అంతే కాక స్పెషలైజేషన్‌లో టీచింగ్ అనుభవం కూడా ఉండాలి. యూజీసీ నెట్‌లో అర్హత కూడా ఉండాలి. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 60 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ పోస్టులకి అప్లై చేసుకునే వారు డిసెంబర్ 9, 2022 లోగా అప్లై చేసుకోవాలి. రూ.500లు రిజిస్ట్రేషన్ ఫీజు కింద చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష, సెమినార్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను https://iiitk.ac.in/ లో చూడచ్చు.