ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థలో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. వాటిని భర్తీ చెయ్యడానికి భారత హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఆన్ లైన్ విధానం ద్వారా స్త్రీ, పురుషులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలు లోకి వెళితే.. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే దీనిలో మొత్తం 150 ఖాళీలు వున్నాయి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా గెట్ స్కోర్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్థుల వయస్సు 27 ఏళ్ళు మించరాదు. కానీ SC, ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు పొందొచ్చు. బీఈ లేదా లేదా బీటెక్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలానే వాలిడ్ గెట్ స్కోర్ కార్డ్ 2020, 2021, 2022 కలిగి ఉండాలి. ఇక దరఖాస్తు విధానం గురించి చూస్తే.. అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక వెబ్ సైట్ నుండి అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు వచ్చేసి.. జనరల్, ఓబీసీ అభ్యర్థులుకి రూ 100. మిగిలిన వారికి ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తు ప్రారంభ తేదీ ఏప్రిల్ 16, 2022. దరఖాస్తు చివరి తేదీ మే 07, 2022. గెట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు, షార్టులిస్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ తో ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలను https://drive.google.com/file/d/1GuXgog4CroRDnJ7HiK6gxGEcztPRSsrb/view లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version