పరీక్ష లేకుండానే ఎన్‌ఎమ్‌డీసీలో ఉద్యోగాలు..ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

jobs

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 29 ఖాళీలు వున్నాయి. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టులును భర్తీ చేస్తోంది. పైగా ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 27 ఏళ్లు మించరాదు. రిజర్వేషన్ ఉంటుంది.

ఇది ఇలా ఉంటే శాలరీ నెలకు రూ.50,000లు ఇస్తారు. ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు కూడా పే చెయ్యచ్చు. ఇక అర్హత వివరాల లోకి వెళితే.. సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదే విధంగా వ్యాలిడ్‌ గేట్‌ 2021 స్కోర్‌ ఉండాలి.

ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. గేట్‌ 2022 స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము రూ.500. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 23, 2022. అప్లై చేసుకోవడానికి https://www.nmdc.co.in/ వెబ్సైట్ లోకి వెళ్ళండి.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version