రైల్వే శాఖలో ఉద్యోగాలు… ఎలాంటి రాత పరీక్ష లేకుండానే…!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. KRCL కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు.

Indian-Railways

కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ కూడా అప్లై చేసుకోచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. వయస్సు విషయానికి వస్తే.. వయస్సు 30 ఏళ్ళు మించరాదు. విద్యార్హతలు చూస్తే.. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తై ఉండాలి.

అదే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి అయితే సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ తో పాటు తప్పని సరిగా రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. డైైరెక్ట్ ఇంటర్వ్యూ కు హాజరైతే సరిపోతుంది. అప్లై చెయ్యాల్సిన పనే లేదు. ఇంటర్వ్యూ తేదీ మే 10 – 14, 2022. శాలరీ విషయానికి వస్తే.. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి రూ 30,000. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి రూ 35,000. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.

ఇంటర్వ్యూ జరిగే అడ్రెస్: USBRL Project Head Office, Konkan Railway Corporation Ltd,Satyam Complex, Marble Market, Extension – Trikuta Nagar, Jammu, Jammu and Kashmir (U.T). PIN 180011

Read more RELATED
Recommended to you

Exit mobile version