జగన్ సర్కార్ గుడ్ న్యూస్…త్వరలో 11,775 పోస్టుల భర్తీ..!

-

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వాస్పత్రిలలో భారీగా ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఒకేసారి 11,775 వైద్య పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా… నేడో రేపో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. ఆ వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం విడుదల చేస్తున్నట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

jagan

కొత్తగా పిహెచ్సీ ల నిర్మాణం జరుగుతుండడంతో ఈ పోస్టులకు అదనంగా మరో 3176 పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీలో వైద్య సదుపాయాలు మెరుగుపడే అవకాశం ఉంది. దాంతో పేదలకు నాణ్యమైన వైద్యం అందే అవకాశం ఉంది. అదేవిధంగా నిరుద్యోగులకు సైతం ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దాంతో ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version