టీడీపీ…. తెలుగు తాలిబన్ల పార్టీ : వైసీపీ ఎమ్మెల్యే

-

తాడేపల్లి : తెలుగు దేశం పార్టీ పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ అని పేర్కొన్నారు జోగి రమేష్‌. దళితుడిగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా ?…అగ్ని కుల క్షత్రియులను తరిమి తరిమి కొడతామని చెప్పింది టీడీపీ అధినేత చంద్రబాబేనని గుర్తు చేశారు.

తన మీద కేసు పెట్టాలని టీడీపీ నేతలు డీజీపీ కి ఫిర్యాదు చేశారని…. మరి చంద్ర బాబు చేసిన వ్యాఖ్యలకు ఆయన పై కేసు పెట్టాలా ఉరిశిక్ష వేయాలా ? అని నిల దీశారు. చంద్రబాబు తమ వర్గాల్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు చేస్తున్న లబ్ది చూసి చంద్రబాబు తట్టు కోలేక పోతున్నారని మండి పడ్డారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పినా.. వారికి జ్ఞానం రావడం లేదని ఫైర్‌ అయ్యారు జోగి రమేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version