బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం.. అతని భార్యకు కోవిడ్ పాజిటివ్.

-

మరోసారి దేశం కోవిడ్ తీవ్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఓ వైపు ఓమిక్రాన్ కమ్ముకొస్తుంది. లాక్ డౌన్లు, ఆంక్షల మధ్య ఇప్పటికే బాలీవుడ్ చాలా దెబ్బతింది. దీనికి తోడు వరసగా పలువురు బాలీవుడ్ యాక్టర్లు కోవిడ్ బారిన పడుతుండటం ఇండస్ట్రీని కలవరపరుస్తోంది.

తాజాగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం కు కరోనా పాజిటివ్ గా తేలింది. జాన్ అబ్రహంతో పాటు ఆయన భార్య ప్రియా రుంచల్ కు కూడా కరోనా సోకింది. అయితే ఇప్పటికే తామిద్దరం వ్యాక్సినేషన్ తీసుకున్నట్లుగా జాన్ అబ్రహం వెల్లడించారు. తమకు కోవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్లుగా తెలియజేశాడు. ఇదిలా ఉంచితే దేశంలో వరసగా పలువురు సెలబ్రెటీలు, సినిమా స్టార్స్, స్టోర్ట్స్ పర్సన్లకు కోవిడ్ సోకింది. గతంలో కరీనా కపూర్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇటీవల కాలంలో బీసీసీఐ ప్రెసిడెంట్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా కోవిడ్ బారిన పడ్డారు. పలువరు రాజకీయ నేతలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో కోవిడ్ కల్లోలం కలిగించింది. ఏకంగా 10 మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు కూడా కోవిడ్ సోకింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version